telugu navyamedia
రాజకీయ వార్తలు

చైనా ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి: అమెరికా మంత్రి

USA Ministor

చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పుడే తమ దేశ వైద్య బృందానికి అనుమతి ఎందుకు ఇవ్వలేదని అమెరికా మంత్రి మైక్ పాంపియో ప్రశ్నించారు. దీనికి చైనా ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కరోనా వైరస్ వుహాన్‌లోనే పుట్టిందని అందరికీ తెలుసని, అక్కడే ప్రయోగశాల ఉన్నప్పుడు తమ అధికారులకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని చైనాను ప్రశ్నించారు. ఈ వైరస్ గురించి అమెరికాకు తెలియని సమాచారం ఇంకా ఎంతో ఉందన్నారు. ఈ మహమ్మారి కారణంగా అమెరికాతో పాటు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ పతనమైందని పాంపియో చెప్పారు.

వైరస్ విషయంలో చైనా నుంచి తమకు ఇప్పుడు సమాధానం కావాలన్నారు. వైరస్ వుహాన్‌లో పుట్టినపుడు తమ దేశంలో కరోనా స్థితిని వివరించాలి. ఎంతమంది చనిపోయారు? ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయాలు అందరికీ తెలియజేయాలన్నారు. కానీ, చైనా అధ్యక్షుడు మాత్రం ఇవేవీ చెప్పకుండా… ఈ వైరస్ అమెరికా సైనికులు లేదా అమెరికా ఆయుధ ప్రయోగశాల సృష్టి అంటున్నారని విమర్శించారు. ప్రపంచానికి తప్పుడు సమాచారం చెప్పిందని, మా దేశ ప్రజల ఆరోగ్యం, వారి జీవన శైలికి ముప్పు తీసుకొచ్చిందిని పాంపియో ఆరోపించారు.

Related posts