telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపిఎల్ కు కరోనా ఎఫెక్ట్… 17 మంది ఆసీస్ ఆటగాళ్లు గుడ్ బై…?

cricket

భారత్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ విస్తృతికి అడ్డకట్ట వేసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. విదేశీ వీసాలను వచ్చే నెల 15 వరకు నిషేధించింది. దేశంలో ఇప్పటి వరకు 120 మందికి కరోనా సోకగా, మూడు మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు రాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో ఆసీస్ క్రికెట్ బోర్డు ‘క్రికెట్ ఆస్ట్రేలియా’ ప్రమేయం ఏమీ లేదని చెబుతున్నారు. ఐపీఎల్‌లో ఆడాలా? వద్దా? అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ తెలిపారు. ఆటగాళ్లు ఐపీఎల్‌తో వ్యక్తిగతంగా ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయం తమకు తెలుసని, ఈ విషయంలో తాము సలహా మాత్రమే ఇవ్వగలమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు సరైన నిర్ణయమే తీసుకుంటారని భావిస్తున్నట్టు కెవిన్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన మొత్తం 17 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరిలో పేసర్ పాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తదితరులు ఐపీఎల్‌తో ఒప్పందాన్ని వదులకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్ వేలంలో 3.2 మిలియన్ డాలర్లు (రూ.15.2 కోట్లు) పలికిన కమిన్స్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం 2.2 మిలియన్ డార్లకు కొనుగోలు చేసింది.

Related posts