telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మసాలా సామ్రాజ్యాధినేత మహాశయ్‌ మృతి

ప్రముఖ మసాలాల కంపెనీ ఎండీహెచ్‌ యజమాని మహాషై ధరంపాల్‌ గులాటి ఇవాళ మృతి చెందారు. గత కొన్ని వారాలుగా ఆయన ఢిల్లీలోని మాతాచానన్‌ దేవి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ధరంపాల్‌ గులాటీని “దాదాజీ” “మహాషైజీ ” అని పిలుస్తుంటారు. 1923 లో పాకిస్థాన్‌లోని సియోల్‌ కోట్‌లో జన్మించారు. ధరంపాల్‌ గులాటి తండ్రి సియోల్‌ కోట్‌లో మసాలాల వ్యాపారం ప్రారంభించారు. దేశ విభజన అనంతరం ఆయన ఢిల్లీలోని కరోల్‌ భాగ్‌లో ఓ షాప్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి మహాషై ధరంపాల్‌ గులాటి దేశంలోని ప్రముఖ కంపెనీగా ఎండీహెచ్‌ను తీర్చిదిద్దారు. ఆయన మృతిపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా సంతాపం ప్రకటించారు. ఆయనను కలిసిన సందర్భంగా ఫోటోలను ట్వీట్‌ చేశారు. ధరంపాల్‌ గులాటి తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసిన వ్యక్తిని కేజ్రీవాల్‌ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరని ప్రముఖులు పేర్కొన్నారు. 

Related posts