telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్‌ఆర్ఆర్’​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ..ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి బ‌స‌వ‌రాజు బొమ్మై

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ ఐదు భాషల్లో మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రమోషన్స్ లో  భాగంగా   జ‌క్క‌న్న‌, తార‌క్, చ‌ర‌ణ్  ప్రస్తుతం స్పెషల్‌ ఇంటర్వ్యూలు బిజీబిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఓ భారీ ఈవెంట్‌కి ప్లాన్‌ చేశారు రాజమౌళి. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

rrr indian biggest pre release event date venue fix ntr and ram charan fans disappointing

 మార్చి 19న బెంగళూరులోని చిక్కబల్లాపూర్‌లో ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్  గ్రాండ్‌గా జరగనుంది. అంతేకాకుండా  ఈ ఈవెంట్​కు కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై, స్టార్​ హీరో శివరాజ్​కుమార్​లు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు స‌మాచారం.

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో రాంచ‌ర‌ణ్ న‌టిస్తుండ‌గా..ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా న‌టిస్తున్నాడు. బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్ సీత రోల్ చేస్తుండ‌గా..అజ‌య్ దేవ్‌గ‌న్‌, శ్రియా, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Rrr Movie Pre Relase Event

డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. 

Related posts