బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసులో భాగంగా డ్రగ్స్ విషయమై హీరోయిన్ దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌కు నార్కోట్రిక్స్ కంట్రోల్ బ్యూరో మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం ఆమె ఇంటిపై సోదాలు నిర్వహించిన ఎన్సీబీ.. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. అయితే ఎంత పరిమాణంలో పట్టుబడ్డాయో స్పష్టత లేదు. కాగా ప్రస్తుతం కరీష్మా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం విచారణకు హాజరుకావల్సిందిగా సమన్లు జారీ చేశారు అధికారులు. కాగా యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు బాలీవుడ్ వర్గాలను కుదిపేస్తున్నాయి. నెపోటిజం ఇష్యూ మొదలుకొని డ్రగ్స్ ఆరోపణల వరకూ బయటకొస్తున్న అన్ని విషయాలు బీ టౌన్ వర్గాలను వణికిస్తున్నాయి. బడా హీరోలుహీరోయిన్లు, దర్శకనిర్మాతలపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండటం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకోగా.. స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్ తదితురులను విచారించిన ఎన్‌సీబీ అధికారులు వారి మొబైల్స్ ను స్వాధీన పర్చుకున్న విషయం తెలిసిందే.
previous post
రాహుల్ అలా చేసి ఉండకూడదు… పబ్ దాడిపై యాంకర్ వ్యాఖ్యలు