telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పిన ధోని… ఎదుకంటే..?

భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న అభిమానుల గురించి అందరికి తెలుసు. ఇక తమిళనాడు లో అయితే ధోని ఫాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ లో ధోని చెన్నై తరపున ఆడుతున్న కారణంగా అక్కడ అందరూ దాదాపు ‘తలా’ అభిమానులే. అయితే అందులో ఒకరైన గోపికృష్ణన్ అనే ఓ వ్యక్తి ధోని పై తనకు ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన ఇంటికి మొత్తం ఐపీఎల్ లో చెన్నై రంగు అయిన పసుపుతో నింపేసాడు. చెన్నై జట్టు యాజమాన్యం ఆ ఇంటిని ట్విటర్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌ అయింది. తాజాగా ఆ ఇంటిపై ధోనీ స్పందించాడు. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఇల్లును నేనూ చూశాను. ఇది నాకు గొప్ప అనుభూతినిచ్చింది. ఒక ఇల్లు నిర్మించేముందు ఎన్నో కలలు కంటుంటాం. కుటుంబంలో అందరి ఇష్టాయిష్టాల మేరకే తీర్చిదిద్దుకుంటాం. ఇంట్లో ఎవరికి నచ్చకపోయినా ఆ ఇంటికి విలువ ఉండదు. అయితే.. ఇక్కడ ఆ అభిమాని కేవలం నా ఒక్కడికి కోసమే కాదు.. చెన్నై జట్టుపై అభిమానంతో ఇల్లు నిర్మించాడు. నిజానికి ఆ విషయంలో కుటుంబ సభ్యులంతా ఒకే నిర్ణయంపై ఉండటం పెద్ద విషయం. ఆ కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు’ అని ధోనీ అన్నాడు. అయితే గోపికృష్ణన్ తన ఇంటి ముందు గోడల పైన ధోని చిత్రాలని, పక్క గోడలపైన సీఎస్కే లోగో ను అలాగే “విజిల్ పోడు” అనే ట్యాగ్ లైన్ ను పెయింట్ చేయించాడు. అయితే ఈ మొత్తం చేయడానికి గోపికృష్ణన్ రూ .1.50 లక్షలు ఖర్చు చేశారు.

Related posts