telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బిహార్‌ ఎన్నికలు: 10 గంటలకు 7.35 శాతం పోలింగ్‌

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. అయితే కరోనా ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీహార్ తొలి విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ పరిమితం చేశారు. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. “కోవిడ్-19” అనంతరం దేశంలో తొలిసారి జరుగుతున్న ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో గరిష్టంగా 1,000 ఓట్లకే పరిమితం చేశారు. శానిటైజర్లు, పీపీఈ కిట్లు, ఇతర పరికరాలను అందుబాటులో ఎన్నికల సంఘం ఉంచింది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలు మొహరించాయి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు హెలీకాప్టర్లు…రెండు తాత్కాలిక హెలీప్యాడ్లను సైతం సిద్ధం చేసారు అధికారులు. బిహార్ ఎన్నికల్లో తొలి గంటలో 5 శాతం పోలింగ్ నమోదవగా…ఉదయం 10 గంటల వరకు 7 .35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 243 సీట్లకు గాను తొలి దశలో 71 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.

Related posts