telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి రాజుగారూ… వర్మకు రాజమౌళి విజ్ఞప్తి

RGV

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఇప్పటికే “కమ్మరాజ్యంలో కడపరెడ్లు” అనే టైటిల్‌తో కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను పోలిన లుక్స్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసాడు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు. ఇటీవ‌ల ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసి సినిమాపై భారీ అంచ‌నాలు పెంచిన వ‌ర్మ తాజాగా కేఏపాల్‌పై స్పెష‌ల్ వీడియో రూపొందించి త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కేఏపాల్ చేసిన కామెంట్స్‌ని అందులో పొందుప‌ర‌చి వీడియో సాంగ్‌గా విడుద‌ల చేశారు. కాగా దానికి కొనసాగింపుగా వర్మ తాజాగా మరో ట్వీట్ చేశాడు. ‘ఇండియాలో జోకర్ మూవీ అంత పెద్ద విజయం సాధించగా లేంది… కేఏ పాల్‌పై వచ్చే బయోపిక్.. బహుబలి 3 కంటే పెద్ద హిట్ అవుతుందన్నారు. దీని కోసం రాజమౌళి వాషింగ్టన్‌లో పాల్‌తో చర్చించారని, ఇదే విషయం తనకు పాల్ ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఈ ట్వీట్‌లో రాజమౌళిని ట్యాగ్ చేశారు. దీంతో దీనిపై స్పందించిన రాజమౌళి వర్మను ఉద్దేశిస్తూ “ఇందులో నన్ను ఇన్వాల్వు చెయ్యొద్దు ‘రాజు’ గారు” అంటూ ట్వీట్ చేశారు.

Related posts