telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దీదీ పై దాడి జరగలేదు.. కేవలం..?

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రచారానికి వెళ్ళినప్పుడు నందిగ్రామ్ లో దాడి జరిగింది.  ప్రచారం ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ఆమెపై దాడి జరిగింది.  దీంతో ఆమెను గ్రీన్ ఛానల్ ద్వారా కోల్ కతాకు తరలించారు.  అక్కడ ఆమెకు చికిత్స అందించారు.  అయితే, మమత బెనర్జీపై జరిగిన దాడిని పరిశీలకులు ప్రత్యేకంగా పరిశీలించారు.  ఈ దాడికి సంబంధించిన నివేదికను ఈరోజు బెంగాల్ సీఎస్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించింది.  మమతపై ఎలాంటి దాడి జరగలేదని ప్రత్యేక పరిశీలకు తేల్చినట్టు రిపోర్టులో పేర్కొన్నారు.  ప్రమాదవశాత్తే మమతకు గాయాలు అయ్యాయని తెలిపారు.  కారు డోర్ తగలడం వలనే మమత కాలికి గాయం అయ్యిందని రిపోర్టులో పేర్కొన్నారు.  మమతపై దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని రిపోర్టులో వెల్లడైంది.  ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమని ప్రభుత్వ సీఎస్ వెల్లడించారు.  మరి దీని పై తృణమూల్ నేతలు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి మరి.

Related posts