ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కంటే పెట్రోల్ హురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎందుకంటే మన దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 100కి చేరింది. కొన్ని చోట్ల ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.100 పలుకుతుంది. ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయంగా ధరలు మాత్రం మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే అత్యధికంగా 13 సార్లు ధరలు పెరిగాయంటే అర్ధం చేసుకోవచ్చు. మన దేశంచుట్టుపక్కల ఉన్న దేశాల్లో పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటె, ఆ దేశంలో పెట్రోల్ ధర కేవలం రూపాయి మాత్రమే. దక్షిణమెరికా దేశాల్లో ఒకటైన వెనిజులా ప్రపంచంలో వెనకబడిన దేశాల్లో ఒకటి. అక్కడ నిత్యం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నది. అయినప్పటికీ ఆ దేశంలో పెట్రోల్ ధరలు మాత్రం ప్రజలకు అందుబాటులోనే ఉంటాయి. వెనిజులా దేశంలో లీటర్ పెట్రోల్ ధర 0.020 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.1.45 అన్నమాట. ఒక్క వెనుజులాలోనే కాదు, ఇరాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.4.50 ఉండగా, అంగోలాలో రూ.17.78 ఉంది. అల్జీరియాలో రూ.25.10 ఉండగా, కువైట్ లో రూ.25.18 ఉన్నది. సూడాన్ లో రూ.27.50, నైజీరియాలో రూ.31.65 గా ఉన్నది. కానీ ఈ ధరలు మన దేశంలోకి 100 ఏళ్ళ తర్వాతనైనా వస్తాయా.. లేదా అనేది తెలియదు.
previous post
next post