telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బెంగళూరు : …మళ్ళీ వచ్చేస్తున్న .. గోల్డెన్‌ చారియెట్‌ రైలు…

golden chariot train ready to launch again

కోట్లాది రూపాయల నష్టం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన గోల్డెన్‌ చారియెట్‌ రైలు త్వరలో ప్రారంభం కానుంది. దేశ విదేశాల పర్యాటకుల కోసం ఈ రైలు సంచారాన్ని తిరిగి ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు భారతీయ రైల్వే కేటరింగ్‌ టూరిస్ట్‌ కార్పొరేషన్‌, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి సీటీ రవి కూడా హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ 2018లో ప్రారంభించిన గోల్డెన్‌ చారియట్‌ రైలు ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉండడంతో రూ.41 కోట్ల మేరకు నష్టాలను అనుభవిస్తోంది. నష్టాలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని భావించి అప్పట్లోనే సంచారాన్ని నిలిపివేశారు.

ప్రయాణ చార్జీలను కొంత మేరకు తగ్గించి మళ్ళీ ఈ రైలును పట్టాలెక్కించాలని తీర్మానించారు. మొత్తం ఐఆర్‌సిటిసికి రైలు సంచార బాధ్యతను పూర్తిగా అప్పగించనున్నారు. కెఎస్‌టిడిసి ఇందుకు అవసరమైన పూర్తి తోడ్పాటును అందించనుంది. తాజాగా ఈ రైలు సంచార మార్గంలో చరిత్రాత్మక ప్రాంతాలు, వన్యజీవి ప్రాంతాలు, కన్నడ సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలను కూడా చేర్చనున్నారు. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణాన్ని ప్రారంభించే స్వర్ణరథం, బండిపుర, మైసూరు, హళేబీడు, చిక్కమగళూరు, హంపి, విజయపురల మీదుగా గోవా వరకు ప్రయాణిస్తుంది. వచ్చే ఏడాది నాటికి ఈ రైల్వే సంచారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేపడుతున్నారు.

Related posts