telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ “ఆదిపురుష్”లో కీర్తి సురేష్ ?

Adipurush

రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త చిత్రం ‘ఆదిపురుష్’ను మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా వస్తోంది. 3డి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ చూసి ఇది రామాయణం ఆధారంగా తెరకెక్కుతోందని అంతా అంచనా వేశారు. ఈ ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తు ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆదిపురష్ టైటిల్ లోగో సైతం.. సోషియో ఫాటసీ కథా నేపథ్యంలోనే ఉండటంతో ప్రభాస్.. విష్ణు అవతారమైన రాముడి పాత్రను పోలిన పాత్రను ఇందులో పోషిస్తాడని తెలుస్తోంది. అయితే రాముడికి సీతగా ఎవరు నటిస్తారనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. అయితే ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రకోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts