telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అంగరంగా నిహారిక పెళ్లి : మెగాస్టార్‌ ట్వీట్‌…

మెగా బాటర్‌ నిహారిక పెళ్లి మరో కొన్ని గంటల్లో కానుంది. డిసెంబర్‌ 9న ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌ వేదికగా చైతన్య-నిహారికల పెళ్లి వేడుక జరుగనుంది…నిహారిక పెళ్లి గుంటూరు ఐజీ ప్రభాకర్‌ రావు తనయుడు వెంకట చైతన్యతో ఈ నెల 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో జరుగనుంది. ఇక రిసెప్షన్‌ డిసెంబర్‌ 11న హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగనుంది. ఇక ఆదివారం నిహారికని పెళ్లికూతురుని చేసే కార్యక్రమం జరగగా దీనికి చిరంజీవి తన సతీమణి సురేఖతో హాజరయ్యారు. తన కూతురికి ఆశీర్వాదం అందించి ఆ తర్వాత సెల్ఫీ దిగారు చిరు. ఆ ఫోటోలో నిహారిక, చిరంజీవి మెరిసిపోతున్నారు. ఇదే ఫోటోని నాగబాబు తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ అయ్యారు. అయితే.. తాజాగా నిహారిక పెళ్లిపై మెగాస్టార్‌ చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. “మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు.” అంటూ ట్వీట్‌ చేశాడు చిరంజీవి. అంతేకాదు.. ఈ ట్వీట్‌ సందర్భంగా నిహారికతో దిగిన చిన్నప్పటి, ప్రస్తుత ఫోటోలను చిరు షేర్‌ చేసి ఎమోషనల్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Related posts