telugu navyamedia
సినిమా వార్తలు

సుమ కొత్త సినిమా టైటిల్ రిలీజ్‌..

బుల్లితెరపై యాంకర్‌గా త‌న‌దైన శైలిలో రాణిస్తున్న సుమ.. బిగ్​స్క్రీన్​పై రీఎంట్రీ ఇవ్వనుంది. 1996లో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే ఓ సినిమాలో హీరోయిన్ గా చేసింది సుమ. మళ్ళీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ లో సుమ సినిమా రాబోతుంది.

తాజాగా సుమ‌ నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్​తో కూడిన​ మోషన్​ పోస్టర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. మెగాపవర్​స్టార్​ రామ్​చరణ్​ దీన్ని రిలీజ్​ చేశారు. ‘జయమ్మ పంచాయతీ’ అనే టైటిల్​ ఖరారు చేశారు.

ఈ పోస్టర్​లో  సుమ రోకలి దంచుతూ సిరీయస్​గా ఉన్న లుక్​.. సినిమాపై ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాలో సుమ ఓ పల్లెటూరిపెద్ద పాత్రను పోషించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి విజయ్​కుమార్​ కలివరుపు దర్శకత్వం వహించగా.. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Related posts