నటి పాయల్ ఘోష్‌పై యాసిడ్ దాడి జరిగింది. పాయల్ తనపై జరిగిన దాడికి సంబంధించిన అంశాలను వెల్లడిస్తూ ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ‘ఇంట్లో వాళ్లకు కావాల్సిన మందులు తీసుకువద్దామని చాలా రోజుల తర్వాత బయటకు వెళ్లాను. నా పనులన్ని పూర్తి చేసుకుని కారు ఎక్కుతుంటే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి నాపై దాడి చేశారు.
ఆ టైమ్‌లో నా చేతికి స్వల్ప గాయాలయ్యాయి. వాళ్ల చేతుల్లో యాసిడ్ బాటిల్స్ ఉన్నాయి. వాటిని చూసిన వెంటనే సాయం కోరుతూ గట్టిగా కేకలు వేశాను. దాంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సంఘటన తర్వాత ప్రతి క్షణం నాకు భయమేస్తోంది. దానిని తలుచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉంది’ అని పాయల్ వివరించారు.
టాలీవుడ్‌లో ‘ప్రయాణం’ సినిమాలో హీరోయిన్‌గా ఏంట్రీ ఇచ్చింది. ‘ఉసరవెల్లి’లో సహాయనటిగా నటించింది. అనుకున్నంతలో విజయాన్ని అందుకోలేకపోవడంతో ‘పటేల్ కీ పంజాబీ షాదీ’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. మరోవైపు గతేడాది ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై పాయల్ మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
నేను ఆ విషయం బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న సమస్య : కంగనా