telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సాహో” ట్విట్టర్ రివ్యూ

Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌నుంది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే అరబ్ స్టేట్స్ లో సెన్సార్ కోసం ఈ సినిమాను ప్రదర్శించడంతో సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజాగా ఈ సినిమా చూసిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ ఏవరేజ్ గా ఉందని, సెకండ్ హాఫ్ బాగుందని, ప్రభాస్ నటన, ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్, యాక్షన్ పార్ట్ బాగున్నాయని కానీ పాటలు, రొటీన్ స్టోరీ బాగా విసిగించాయని కామెంట్స్ పెడుతున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొన్ని సన్నివేశాల్లో బాలేదని అంటున్నారు. హిందీ వెర్షన్ చూసిన వారు.. ప్రభాస్ డబ్బింగ్ పెద్దగా సూట్ కాలేదని, సినిమాలో యాక్షన్ తప్ప సరైన స్టోరీ లేదని, స్క్రీన్ ప్లే వర్క్ బాలేదని, ప్రభాస్ కోసం, యాక్షన్ సీన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చని చెబుతున్నారు. మరి రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related posts