telugu navyamedia
సినిమా వార్తలు

స్టార్ హీరోకు అరెస్ట్ వారెంట్

Kannada Super Star Sudheep Arrest Warrant
కన్నడ స్టార్ హీరో సుదీప్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. కాఫీ ఎస్టేట్ వివాదంలో సుదీప్ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆగ్రహించిన చిక్క మంగళూరు న్యాయస్థానం సుదీప్ పై నాన్ బెయిలబుల్ వారెంట్, అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 
వివరాల్లోకి వెళ్తే…. 2016లో కన్నడ టీవీ షో వారసదార షూటింగ్ కోసం దీపక్ పటేల్ అనే వ్యక్తికి చెందిన కాఫీ ఎస్టేట్ ను సుదీప్ అద్దెకు తీసుకున్నారు. అందుకోసం రూ.80 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్సు గా రూ.50 వేలు ఇచ్చి మిగిలిన డబ్బులు చెల్లించలేదట. దీంతో దీపక్, సుదీప్ పై, సుదీప్ కు చెందిన ప్రొడక్షన్ హౌస్, డైరెక్టర్ మహేష్ లపై కేసు నమోదు చేశారు.
తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, కాఫీ తోటల్ని, కొంత ఆస్తిని కూడా నాశనం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసులో సుదీప్ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరిగుతున్నాడని ఆరోపణలు చేశారు. దీంతో ఆగ్రహించిన కోర్టు మే 22లోపు సుదీప్ ఆచూకీ తెలుసుకుని, అతడిని కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా కర్ణాటక పోలీసులను ఆదేశించింది. 

Related posts