telugu navyamedia
సినిమా వార్తలు

ఆ విషయంలో “బాహుబలి”ని మించిన “సైరా”

Syeraa

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. సురేందర్‌రెడ్డి దర్శకుడు. అమిత్‌ త్రివేది స్వరకర్త. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిరంజీవి తన 41 ఏళ్ళ కెరీర్‌లో ఒక హిస్టారికల్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు చిరంజీవి నటించిన ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం,కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కావడం అనేది కూడా ఫస్ట్ టైమే అని చెప్పొచ్చు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘U/A’ సర్టిఫికేట్ ను పొందింది. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మేకింగ్‌లో వి.ఎఫ్‌.ఎక్స్ చాలా కీల‌క‌భూమిక పోషించింది. ఈ సినిమా వి.ఎఫ్‌.ఎక్స్‌ గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెలిపారు. అదేంటంటే ‘బాహుబ‌లి’కి 2300 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్‌ను మాత్ర‌మే వాడితే, సైరాకు 3800 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించార‌ట‌. అంటే 1500 వి.ఎఫ్‌.ఎక్స్‌ షాట్స్‌ను అధికంగా ఉప‌యోగించార‌ట‌. ఓ డైరెక్ట‌ర్‌గా అన్ని వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్‌ను ఉప‌యోగించ‌డం ఎంత క‌ష్ట‌మో త‌న‌కు తెలుసున‌ని రాజ‌మౌళి చెప్పారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related posts