telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కొత్త లుక్… ఫోటోలు వైరల్

Pawan

కొన్ని రోజుల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మూడు భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో ఒకటి పింక్ రీమేక్ కాగా.. ఆ సినిమాకి వకీల్ సాబ్ అనే పేరు కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ మొగలాయిల కాలం నాటి పాత్రలో చేస్తున్నారు. ఈ పాత్ర దొంగ పాత్ర కాగా.. అది రాబిన్ హుడ్ లాంటి పాత్ర. ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ తన లుక్ పూర్తిగా మార్చేసుకున్నాడు. ఆ నాత్ర కోసం గడ్డం కూడా తీసేశాడు. కాస్త మీసం పెద్దదిగా ఆనాటి లుక్‌లో కనిపించాడు. లేటెస్ట్‌గా కార్యకర్తలతో మీటింగ్‌లో ఇలా కనిపించాడు పవన్ కళ్యాణ్. అయితే లేటెస్ట్ లుక్ మాత్రం క్రిష్ సినిమా కోసమే. ఈ రెండు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్‌తో మరో సినిమాని చేస్తున్నాడు. రాజకీయాల్లో ఉన్నంతకాలం గుబురు గడ్డం, మీసాలతో కనిపించిన పవన్ కళ్యాణ్.. గడ్డం తీసేసి కొత్తగా కనిపించగానే ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts