telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం.. మరో స్టార్‌ డైరెక్టర్‌కు పాజిటివ్‌

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశంలో దాదాపు ఏడాదికి పైగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది . అయితే ఆ మధ్య కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్‌ అందరికి సోకుతోంది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడారంగంలోనూ ఈ వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్న లోకేష్ కనకరాజ్‌ కు కరోనా సోకింది. ఇటీవల కొవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ రిజల్ట్ రావడంతో వెంటనే చెన్నయ్ లోని ఓ హాస్పిటల్ లో లోకేశ్ చేరాడు. అయితే హాస్పిటల్ వర్గాల సహకారంతో తాను త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తానని ట్విట్టర్ ద్వారా స్నేహితులు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులకు లోకేశ్ తెలియచేశాడు.

Related posts