telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రకుల్ ద్విపాత్రాభినయం ?

rakul

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. ఎన్నో సినిమాల్లో గ్లామర్ రోల్స్ పోషించి భారీ పాపులారిటీ కూడగట్టుకుంది. అయితే చివరగా తెలుగులో మన్మథుడు 2 మూవీలో నాగార్జునతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి అవకాశాలు సన్నగిల్లడంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టేసింది.హిందిలో అజయ్ దేవ్‌గన్‌తో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. అయినా అమ్మడికి అవకాశాలు రావడంలేదు. గత రెండు సంవత్సరాలుగా వచ్చిన ఒకటి రెండు ఆఫర్లు ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలను తెచ్చి పెట్టలేక పోయాయి.దాంతో రకుల్ వెబ్ సిరీస్ ల వైపు చూస్తుందట. తాజాగా ఏ వెబ్ సిరీస్ లో కవల పిల్లల పాత్రలో రకుల్ కనిపించబోతుంది. కవల అమ్మాయిల మద్య జరిగే కథ ఆధారంగా రూపొందబోతున్న వెబ్ సిరీస్ లో రకుల్ నటించబోతుంది. రకుల్ ప్రీత్ సింగ్ నటిగా ఈ వెబ్ సిరీస్ తో తన ప్రతిభను కనబర్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వెబ్ సిరీస్ కు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది.

Related posts