telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితేజతో రొమాన్స్‌ చేయనున్న రాశి ఖన్నా..!

టాలీవుడ్ లో రవితేజా ఎప్పటికప్పుడు మాస్ ఎంట్రీలతో, డైలాగ్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంటాడు. అయితే కొత్త సంవత్సరానికి రవితేజ డబుల్ ధమాకా పేల్చాడు. ఒకవైపు క్రాక్ ట్రైలర్‌తో అందరికి సూపర్ ఎంటర్‌టైన్ చేశాడు. దాంతో పాటుగా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఖిలాడీ సినిమా పోస్టర్ విడుల చేసి అభిమానులకు పిచ్చెక్కించాడు. ఈ పోస్టర్‌లో రవితేజా రెండు గెటప్స్‌లో ఉన్నాడు. వాటిలో ఒకదానిలో అమాయకంగా ఉన్న రవితేజా మరొకదానిలో కన్నింగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. అబిమానుల్లో ఖిలాడీ పోస్టర్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్టర్‌ను రవితేజ తన ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. దాంతో పాటుగా మిమ్మల్ని అలరించడానికి సమ్మర్‌లో వస్తున్నాం అంటూ రాసుకొచ్చాడు.  అయితే..తాజాగా ఈ మూవీ నుంచి మరో వార్త వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉందట. ఈ సాంగ్‌ కోసం రాశి ఖన్నాను అనుకుంటున్నారని తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే ఆమెను సంప్రదించారని టాక్‌. ఇక ఈ సినిమా ఓ తమిళ్‌ సినిమా ఆధారంగా రాబోతుందని సమాచారం.

Related posts