telugu navyamedia
సినిమా వార్తలు

మీటూ కేసులో హీరోయిన్ కు షాక్

Shruthi

ప్రముఖ హీరోయిన్ కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ కన్నడ, మలయాళీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. 30 ఏళ్ల శృతి గత ఏడాది మీటూ ఉద్యమం ఉధృతంగా మారినవేళ సీనియర్ హీరో అర్జున్ తనని లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేయడమే కాకుండా ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్ళింది. మీటూ ఉద్యమం నడుస్తున్న సమయంలో సీనియర్ నటుడు అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసుల కారణంగా అర్జున్ పోలీస్ స్టేషన్ కు కూడా హాజరవుతూ వస్తున్నాడు. మరోవైపు శ్రుతిపై కూడా కేసులు నమోదయ్యాయి. అర్జున్ కుటుంబసభ్యులు శ్రుతిపై కేసులు నమోదు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలు చేసిన రాజీ ప్రయత్నాలు కూడా సక్సెస్ కాలేదు. మరో వైపు అర్జున్ కూడా శృతి హరిహరన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసులు కోర్టులో నడుస్తున్నాయి. మరో పక్క తమ తండ్రి పరువుకి శృతిహరిహరన్ భంగం కలిగించిందని అర్జున్ పిల్లలు ఆమెపై ఐదుకోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేశారు. ఈ కేసు విచారణ కూడా కొనసాగుతుంది. అయితే అర్జున్ పిల్లలు తనపై అన్యాయంగా కేసు పెట్టారని, ఆ కేసు చెల్లదంటూ శృతిహరిహరన్ కోర్టు కెళ్లింది. అయితే కోర్టు ఆమె పిటిషన్‌ని కొట్టివేసింది.

Related posts