ఇటీవల కరోనా బారిన సత్యరాజ్ కు..ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడడంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యరాజ్ తాజాగా కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అయితే ఆయన ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సత్యరాజ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ పలు వార్తలు రావడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కట్టప్ప అభిమానులకు ఆయన కుమారుడు శిబి సత్యరాజ్ గుడ్ న్యూస్ చెప్పారు.
తాజాగా కట్టప్ప కోలుకున్నాడు అంటూ ఆయన కుమారుడు శిబి సత్యరాజ్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. గత రాత్రి అప్పాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయన ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. క్షేమంగా ఉన్నారు.
కొన్ని రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని… ఆ తర్వాత షూటింగుల్లో పాల్గొంటారని ఆయన కుమారుడు పేర్కొన్నాడు. అలాగే సత్యరాజ్ కొడుకు తన తండ్రి పట్ల చూపుతున్న ప్రేమ, సపోర్ట్ కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
Hey guys..Appa got discharged from the hospital last night and back home..He’s totally fine and will resume work after few days of rest..Thank you all for your love and support! 😊🙏🏻 #Sathyaraj
— Sibi Sathyaraj (@Sibi_Sathyaraj) January 11, 2022