కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఇప్పుడు తాత కాబోతున్నారు. తన కూతురు తనని తాతని చేయబోతోంది. విక్రమ్, శైలజలకు ధృవ్‌తో పాటు మరో కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఆమె పేరు అక్షిత. ఆమె వివాహం 2017లో మను రంజిత్‌తో జరిగింది. ఇప్పుడా దంపతులు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీంతో విక్రమ్ ఫ్యామిలీలో ఆనందం నెలకొంది. ఈ విషయం తెలిసిన విక్రమ్ అభిమానులు కూడా ఎంతో సంతోషాన్ని తెలియజేస్తూ.. సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక టాలీవుడ్‌లో స్టార్ హీరోలు చిరు, బాలయ్యలు ఇప్పటికే తాతయ్యలుగా మారారు. నాగార్జున, వెంకటేష్.. ‘తాతా’ అని అనిపించుకోవడానికి వెయిట్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే.
పవన్ కు వ్యతిరేకంగా మేము ప్లాన్ చేయలేదు… ట్రోల్ చేయకండి : రాజశేఖర్