telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో కరోనా మృత్యు ఘంటికలు.. ఘాటుగా స్పందించిన దేవినేని

devineni on power supply

ఏపీ లో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో మృత్యు ఘంటికలు మొగిస్తున్నాయి. దీంతో రికార్డు స్థాయిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. కరోనా కేసులు రోజుకి 5,000 దాటుతున్నాయి, మరణాలు 700 దాటాయి. కరోనా బారినపడ్డ బాధితులు బెడ్లు, వెంటిలేటర్లు అందించాలని వేడుకుంటున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి, జర్నలిస్టులకి, ప్రజలకి భరోసా కల్పించడానికి ఏం చర్యలు తీసుకున్నారు జగన్ గారు?’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

ఏపీలో కరోనా విజృంభణను తెలుపుతూ వచ్చిన పలు వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. ఏపీలో ఐదు రోజుల నుంచి వరుసగా నాలుగు వేల పైనే కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజులో 4,944 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఏపీలో మొత్తం బాధితుల సంఖ్య 58,668కి చేరింది.

Related posts