దుబ్బాక ఉత్కంఠ పోరులో బీజేపీ ఘన విజయం సాధించింది. దుబ్బాకలో 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. నరాలు తెగే ఉత్కంఠ పోరులు బీజేపీ తక్కువ మెజారిటీ తో గెలిచింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిపై రఘనందన్‌రావు గెలుపొందారు. ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనుకున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెమటలు పట్టించి మరీ..బీజేపీ విజయం సాధించింది. తమ ఓటమికి చపాతి రోలర్ కారణమని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కారును పోలిన గుర్తును స్వతంత్ర అభ్యర్థికి చపాతీ రోలర్ ని కేటాయించారు. ఈ గుర్తే టీఆర్‌ఎస్ కొంప ముచ్చిందని సొంత పార్టీ నాయకులు అనుకుంటున్నారు. అయితే..చపాతీ రోలర్ అచ్చం కారు లాగే ఉండటం విశేషం. ఈ ఎన్నికలో కారును పోలిన గుర్తు చపాతీ రోలర్ కు 3489 ఓట్లు వచ్చాయి. అలాగే..నోటాకు నోటా కు 552 ఓట్లు పోల్ అయ్యాయి. చపాతీ రోలర్ ఓట్లు టీఆర్‌ఎస్ కు వచ్చేయని…దుబ్బాక ప్రజలు కారు గుర్తు అనుకుని చపాతీ రోలర్ కు వేసారని టీఆర్‌ఎస్ నాయకులు వాపోతున్నారు. ఏది ఏమైనా చివరికి దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురవేసింది.
previous post
next post
ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని బయటపెడుతాం: డీకే అరుణ