telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాగల్ టీజర్ అప్డేట్..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం పాగల్. ఈ సినిమా తమిళ హిట్ సినిమా ‘ఓ మై కడవులే’ రీమేక్‌గా తెరకెక్కతుంది. ఈ సినిమాకు తరున్ భాస్కర్ తెలుగు స్క్రీన్ ప్లే రాశారు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విశ్వక్ నోటెడ్ అయ్యాడు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం విశ్వక్ చేస్తున్న సినిమా పాగల్.ఈ సినిమాను నరేష్ కుప్పిల్లి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ టీజర్ రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విశ్వక్ తన రొమాంటిక్ యాంగిల్‌ను చూపించనున్నారు. మరి ప్రేక్షకులను పాగల్ సినిమాతో ఏమాత్రం ఆకట్టుకుంటారో వేచి చూడాలి.

Related posts