telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెమ్యూనరేషన్ పెంచేసిన “నగ్నం” బ్యూటీ

Sri rapaka

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘నగ్నం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రీ రాపాక. తొలి సినిమాతోనే తన అందాలన్నీ బయటపెట్టేసిన శ్రీ రాపాకకు ఇప్పుడు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. దీంతో ఆ అమ్మడు రేటు పెంచేసినట్లు తెలుస్తోంది. నగ్నం సినిమాకు సంబంధించి ఆమె రోజుకు రూ.1-2 లక్షల వరకు రెమ్యునరేషన్‌ ఇచ్చారట. ప్రస్తుతం ఆమె ‘ద లస్ట్’ అనే వెబ్‌ సిరీస్‌‌లో నటిస్తోంది. ఇటీవలే రిలీజైన టీజర్‌ లో శ్రీ తన హొయలన్నీ ఒలకబోస్తూ ఆకట్టుకుంది. టీజరే ఈ రేంజ్‌లో ఉంటూ ఇక అసలు కంటెంట్‌ ఎలా ఉంటుందోనని వీక్షకులు ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు ఆమె మరో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 1990 కాలంలో జరిగిన ఓ ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘కాత్యాయని’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పేశారట. హాట్‌ హాట్‌గా క‌నిపించేందుకు ఆమె ఎలాంటి అభ్యంత‌రాలు పెట్టక‌పోవ‌డంతో రూ.10 లక్షలైనా ఇచ్చేందుకు నిర్మాతలు సై అంటున్నారట. మొత్తానికి వర్మ ‘నగ్నం’ సినిమా శ్రీకి బాగానే కలిసొచ్చింది.

Related posts