telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుష్క బాటలో బాలీవుడ్ హీరోయిన్… ప్లస్ సైజ్…!

Kriti

కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో సక్సెస్ జర్నీ చేస్తోంది. కృతి అనగానే ప్రేక్షకులకు మెరుపు లాంటి అందాలు గుర్తుకొస్తాయి. అయితే ఈ ముద్దుగుమ్మ బొద్దుగుమ్మగా మారబోతుందట. 2011 లో మరాఠాలో విడుదలైన ‘మాలా ఐ వైచై’ అనే సినిమా సంచలన విజయాన్ని సాధించింది. నర్తకిగా మొదలైన ఓ యువతి ప్రయాణం సరోగసి తల్లిగా మారే క్రమంలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటుందన్నదే ఆ చిత్ర కథ. అయితే ఇప్పుడు ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో కృతికి అవకాశం దక్కిందట. ఆ పాత్ర కోసం ఈ బక్కపల్చటి భామ సుమారు 15 కేజీల బరువు పెరగబోతోందట.ఇందులో భాగంగానే ఈ క్యూట్ హీరోయిన్ ఇప్పుడు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువుగా ఉండే ఫుడ్ ని ఇష్టంగా ఆరగించేస్తుందట. పైగా వర్కౌట్స్ కి కూడా భై చెప్పేసి చిల్ అవుతోందట ఢిల్లీ బ్యూటీ. అయితే ‘సైజ్ జీరో’ మూవీ కోసం భారీగా సైజు పెరిగిన అనుష్క కెరీర్ లో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. అప్పట్లో మహేశ్ పక్కన ‘వన్’లో నటించి తళుక్కున మెరిసిన బ్యూటీ సక్సెస్ అందుకోలేకపోయింది.

Related posts