మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ‘యు టర్న్’లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న భారీ చిత్రం` సీటీమార్`. ఈ ప్రెస్టీజియస్ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. తరుణ్ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఈ ఏడాది బ్లాక్ బస్టర్‌గా నిలిచిన క్రాక్‌తో ఫేమస్ అయిన అప్సరా రాని కూడా పాల్గొంటున్నారు. క్రాక్ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో అప్సరా రాని తన అందాలతో కుర్రకారుని కట్టిపడేశారు. తన అందం, డాన్సులతో అప్సరా సోషల్ మీడియాలో విపరీతమైన్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. ఈ అమ్మడు ఇప్పుడు గోపీచంద్ సీటీమార్ సినిమాలో కూడా కనిపించనున్నారంట. ఈ మేరకు సీటీమార్ దర్శకుడు సంపత్ నంది తెలిపారు. సీటీమార్ సెట్స్‌లోకి పటాక్ రానికి స్వాగతం అంటూ సంపత్ ట్వీట్ చేశారు. గోపీచంద్ సినిమాలోని స్పెషల్ సాంగ్‌ని కూడా మరింత స్పెషల్ చేసేందుకు అప్సరా రాని రెడీ అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా భాటియా ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
previous post
next post
బిగ్‌బాస్ షో..ఓ బూతు ప్రోగ్రాం..