telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఈ టీ తాగితే మహిళల్లో ఆ సమస్యకు మటాష్ !

చాలా మంది మహిళల్లో హార్మోన్ల హెచ్చతగ్గుల వల్ల ఒక్కోసారి నెలసరి సమయానికి రాదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మందులు వాడవచ్చు. అయితే.. ఔషధ గుణాలున్న షాహ్‌, పలు రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఇవి సమర్థంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు.
దాల్చిన చెక్క టీ : అంగుళం పొడవున్న దాల్చిన చెక్కను నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ నీటిని వడబోసి ఉదయాన్నే పరిగడుపున తాగాలి. నెల రోజులు దాల్చిన చెక్క టీ తాగితే నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. మహిళల్లో సంతాన సాఫల్యాన్ని పెంచుతుంది. పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌, బరువు తగ్గడం, రుతుచక్రాన్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క టీ చక్కగా పనిచేస్తుంది.
అల్లం, తులసి టీ : సగం, అంగుళం అల్లం, నాలుగు తులసి ఆకులను కప్పు నీళ్లలో వేసి మరిగించాలి. ఈ టీని పరిగడుపునే తాగాలి. తులసి ఆండ్రోజన్‌, ఇన్సులిన్‌ హార్మోన్‌ విడుదలను నియంత్రిస్తాయి. అల్లం ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మన్లు సమపాళ్లలో రిలీజ్‌ అయ్యేందుకు పనిచేస్తాయి.

Related posts