ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. మూడు రాజధానుల వ్యాఖ్యలు సీఎం జగన్ అనుభవరాహిత్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలే తప్ప పరిపాలన వికేంద్రీకరణ సరికాదని అన్నారు.
ఇప్పుడిప్పుడే అమరావతిలో కుదురుకుంటున్న ఉద్యోగులు మళ్లీ విశాఖ వెళ్లడం సాధ్యంకాదని అభిప్రాయపడ్డారు. సీఎం తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. పార్టీ తరపున ప్రతినిధి బృందాన్ని అమరావతికి పంపిస్తున్నట్టు కన్నా తెలిపారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే షర్మిల వివాదం