telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో” వేడుకలో ప్రభాస్ చేతి గడియారం… ధర తెలిస్తే షాకే…!

PRabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండడంతో అభిమానులు తొలి రోజే ఈ సినిమాని వీక్షించేందుకు పోటీలు ప‌డుతున్నారు. ఆగష్టు 18న ‘సాహో’ గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్రభాస్, రాజ‌మౌళి, వివి వినాయ‌క్, అల్లు అరవింద్, శ్ర‌ద్ధా క‌పూర్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న స‌మ‌యంలో కెమెరా ఎక్కువ‌గా ప్ర‌భాస్‌పైనే ఫోక‌స్ పెట్టింది. ఆ స‌మ‌యంలో ప్ర‌భాస్ ప్ర‌ద‌ర్శించిన హావ‌భావాలు ప్రేక్ష‌కుల‌కి కొత్త‌గా అనిపించాయి. ఇక ఆయ‌న పెట్టుకున్న చేతి గ‌డియారం కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ వాచ్ గురించి ఆరాలు తీయ‌గా అది ‘హబ్లట్’ కాగా.. ఆ వాచ్ ధర రూ. లక్షల పైమాటే ఉంటుందని అంచనా. హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ తరహా వాచ్‌లను ధరిస్తారు. ఈ బ్రాండ్‌కి సంబంధించిన వాచ్‌లు రూ. 15 లక్షల నుండి రూ. కోటి వరకూ ధర పలుకుతున్నాయి.

Related posts