telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’ అధ్యక్ష బరిలో మరో సీనియర్‌ నటుడు

‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ‘మా’ అధ్యక్ష బరిలో ఐదుగురు సెలబ్రిటీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడిగా తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు ఓ సీనియర్ నటుడు. ఆయనెవరో కాదు కాదంబరి కిరణ్ (Kadambari Kiran). ఈయన చాలా కాలంగా ‘మా ‘ లో సభ్యుడిగా ఉన్నాడు. శివాజీ రాజా ప్యానల్ లో కూడా పని చేసాడు. ‘మా ‘ అసోసియేషన్ బాగా పాడైపోయిందని.. కేవలం పదవుల కోసమే చూసుకుంటూ విమర్శలు చేసుకుంటున్నారంటూ ఈ మధ్యే కిరణ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఈయన కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు గెలిచి చూపిస్తానని ధీమాగా వ్యక్తం చేశాడు. ఇప్పటికే అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీలో ఉన్నానంటూ కిరణ్ ప్రకటించాడు. తనకు సినిమాల నుంచి వచ్చే డబ్బులు తప్ప వేరే ఆదాయం లేదని స్పష్టం చేసాడు కాదంబరి కిరణ్. ఇండస్ట్రీతోపాటు బయట కూడా తనను చాలా మంది కోటీశ్వరుడు అనుకుంటున్నారని.. అలాంటిదేం లేదని చెప్తున్నాడు కాదంబరి కిరణ్.

మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా తాను బావా బావమరుదులమని.. తమ మధ్య గ్యాప్ ఉంటే మంచిదని కాదంబరి కిరణ్ తెలిపాడు. అంతేకాదు.. ‘మా ‘లో 900 మంది సభ్యులున్నా కూడా..ఎన్నికలు జరిగినపుడు ఓటు వేయడానికి కేవలం 415 మంది మాత్రమే వస్తారని చెప్పాడు. అందులో 300కు పైగా ఓట్లు తనకే పడతాయని కాదంబరి కిరణ్ ధీమాగా చెప్తున్నాడు.

ఓవర్ కాన్ఫిడెన్స్ తో తాను చెప్పడం లేదని.. ఎన్నిక జరిగిన తర్వాత ఆ విషయం మీరే ఒప్పుకుంటారని సవాల్ చేస్తున్నాడు కాదంబరి కిరణ్. మా అధ్యక్ష పదవికి గెలవడం కష్టం కాదని.. అనవసరంగా దాన్ని పెద్దది చేసి చూపిస్తున్నట్లు చెప్పాడు కాదంబరి కిరణ్. ఎన్ని ఓట్లు పోల్ అయినా తనకు 300 ఓట్లు గ్యారంటీ అని కాదంబరి కిరణ్ కామెంట్ చేసాడు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Related posts