telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : అఖిల్, సోహైల్ రచ్చ

Bigg-Boss-4

బిగ్ బాస్ హౌస్‌లో 9వ వారం నామినేషన్ హీట్‌ మామూలుగా లేదు. ఇప్పటి నుంచి బిగ్ బాస్ ఇంటి సభ్యులు అసలైన ఆటను కనపరిచే సమయం ఆసన్నమైంది అంటూ గుడ్లు ఇచ్చి వాళ్ల తలపై పగలగొట్టి మరీ నామినేట్ చేయాలని కోరారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అఖిల్ మాట్లాడుతూ.. “ఇంట్లో ఉండ‌టానికి అర్హ‌త ఉండాలి. పోతా పోతా అని మీరే ప‌దిసార్లు అంటుంటారు. కాబ‌ట్టి వెళ్ల‌డానికి మీరు రెడీ అయితే పంపించ‌డానికి కూడా నేను రెడీనే” అని మాస్ట‌ర్ త‌ల‌పై గుడ్డు ప‌గ‌లగొట్టాడు. త‌ర్వాత త‌న క్లోజ్ ఫ్రెండ్ అయిన మోనాల్‌ను నామినేట్ చేయ‌డం ఇంటిస‌భ్యుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను సైతం షాక్‌కు గురి చేసింది. కాసేపు మాట్లాడ‌క‌పోయే స‌రికే నా అఖిల్ ఇలా ఉండ‌డు అంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. అలాంటిది ఏకంగా నామినేట్ చేయ‌డంతో ఆమెకు ఏడుపు క‌ట్ట‌లు తెంచుకుంది. ఇది చూసిన మాస్ట‌ర్‌ ‘వాడేంటి మిగ‌తా ఫ్రెండ్స్‌ను ప‌క్క‌న‌పెట్టి నీమీద వేశాడు’ అని అగ్నికి ఆజ్యం పోస్తూ మాట్లాడాడు. దానికి మోనాల్ రిప్లై ఇస్తూ.. అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాలేరు.. కొంచెం మోర్ కావాలి?? ఆ మోర్‌ అఖిల్‌కు ఇవ్వ‌లేదు క‌దా! అదే ప్రాబ్లమ్’ అని చెప్పుకొచ్చింది. ఆమె ప‌రిస్థితిని చూసి జాలిప‌డ్డ మాస్ట‌ర్ ‘నువ్వు ఉండే వ‌ర‌కూ నేను నీకు స‌పోర్ట్‌గా ఉంటా’ అని మోనాల్ చేయి ప‌ట్టుకుని ధైర్యం చెప్పాడు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌తో అవినాష్‌, అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, మోనాల్ ఒక టీమ్‌గా ఏర్ప‌డిన‌ట్లు ప్రోమోలో చూపించారు. మరో ప్రోమోలో అఖిల్, సోహైల్ గొడవ పడుతున్నట్టుగా తెలుస్తోంది. అసలేం జరుగుతుందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ ను చూడాల్సిందే.

Related posts