telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దేవుడే పోలీసుల రూపంలో శిక్షించాడు : నందమూరి బాలకృష్ణ

no more movies in near future by balakrishna

తాజాగా పోలీస్ ఎన్కౌంటర్ లో నిందితులు చావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్‌పల్లికి వ్యాన్‌లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. దిశ దశదిన కర్మ రోజునే ఆ నరరూప రాక్షసులు కూడా హతమయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దేవుడే పోలీసుల రూపంలో దిశ నిందితులను శిక్షించాడని పేర్కొన్నారు. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరిందని బాలకృష్ణ తెలిపారు. అనంతరం బోయపాటి మాట్లాడుతూ.. పోలీసుల నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. అందుకు ఇవాళ్టి ఎన్‌కౌంటరే ఉదాహరణ అని బోయపాటి శ్రీను తెలిపారు. నేడు నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో చిత్రం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు దుర్మార్గులు దారుణంగా రేప్‌ చేసి తరువాత సజీవ దహనం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఇలాంటి దారుణాలు ఇక మీదట జరగకుండా గట్టి చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ దారుణానికి పాల్పడ్డ రాక్షసులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు.

Related posts