telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

గూగుల్ పే పై .. సైబర్ నేరగాళ్ల కన్ను..

cyber cheaters hack google pay

గూగుల్ పై కూడా సైబర్ నేరగాళ్లు పడ్డారు. తాజాగా ఆ సంస్థ యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ వాటిపై నజర్ పెట్టారు. ఈ లావాదేవీల్లో ఏదైనా గందరగోళానికి గురై ఆ యూపీఐ సంస్థలకు సంబంధించిన కాల్ సెంటర్‌ల ఫోన్ నంబర్ల కోసం వెదుకుతారని పసిగట్టారు. అలాంటి వారిని బురిడీ కొట్టించేందుకు సైబర్ చీటర్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను వేదికగా చేసుకున్నారు. ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఆ సంస్థల పేరిటి అక్షరం తేడాతో నకిలీ కాల్ సెంటర్‌లుగా నమోదు చేసుకుని, ఫోన్ నంబర్లను నమోదు చేస్తున్నారు. ఇది తెలియక చా లామంది ఆ కాల్ సెంటర్‌ల ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తుండడంతో సైబర్ మోసగాళ్లు మాటల్లో పడేసి బ్యాంకు ఖాతా నంబర్లు, యూపీఐ పిన్ నంబర్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల నంబర్లను తీసుకుంటున్నారు. ఆ తర్వాత తాపీగా ఆ ఖాతాల్లో ఉన్న మొత్తం నగదును ఖాళీ చేస్తున్నారు.

ఒక యూపీఐ లావాదేవీలకు సంబంధించిందే కాదు… చాలా వ్యవహారాలకు సంబంధించిన నకిలీ కాల్ సెంటర్ ల ఫోన్ నంబర్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో పెట్టి మోసం చేస్తున్నారు. ఈ విధంగా మోసపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉం డాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. దీంతో నెటిజన్‌లతో పాటు యూపీఐ ద్వారా లావాదేవీలను నడిపించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య వివిధ గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించిన నంబర్లను కూడా సైబర్ చీట ర్లు నమోదు చేసుకుంటున్నారని తెలిసింది. దీనిపై సైబర్ క్రైం పోలీసులు గూగుల్‌కు నమోదవుతున్న కేసులు, సైబర్ చీటర్ల నేర ప్రక్రీయ గురించి వివరిస్తూ లేఖలు రాసి… ఇలా నకిలీ కాల్‌సెంటర్ నంబర్లను నమోదు చేసుకుంటున్న వారిని గుర్తించి, వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేశా రు. ప్రాథమికంగా కొన్నింటిని తొలగించినా… తిరిగి అవి నమోదవుతుండడంతో శాశ్వత పరిష్కారానికి గూగుల్ సంస్థ ప్రయత్నించాలని సైబర్ క్రైం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related posts