telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

టీకా ఉత్పత్తిని పెంచడానికి సిద్ధమైన సీర‌మ్…

corona vacccine covid-19

కరోనా టీకా ఉత్పత్తిని పెంచడానికి కట్టుబడి ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. గత ఏడాది కాలంగా భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాము.. వారి మద్దతుకు ధన్యవాదాలు తెలిపిన సీరం.. ఇది కొన‌సాగుతోంద‌ని ప్ర‌క‌టించింది.. అయితే, గ‌త ప్ర‌క‌ట‌న‌లో సీరం అధినేత కాస్త ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.. వ్యాక్సిన్ల కొర‌త జులై వ‌ర‌కూ త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేశారు సీరం సీఈవో అద‌ర్ పూనావాలా… ఈ కొర‌త‌కు బాధ్య‌త త‌మ కంపెనీది మాత్ర‌మే కాదు ప్ర‌భుత్వానిదే అని కూడా అన్నారు.. జ‌న‌వ‌రిలో ప‌రిస్థితి చూసి ఇక ఇండియాలో క‌రోనా ప‌నైపోయింద‌ని అంద‌రూ అనుకున్నారు. సెకండ్ వేవ్‌ను అంచ‌నా వేయ‌డంలో అధికార యంత్రాంగం దారుణంగా విఫ‌ల‌మైంద‌న్న ఆయ‌న‌.. రాజ‌కీయ నాయ‌కులు, విమ‌ర్శ‌కులు వ్యాక్సిన్ కొర‌త‌కు మా కంపెనీని బ‌ద‌నాం చేశార‌ని కాస్త ఘాటుగా స్పందించారు.. కానీ, దీనికి పూర్తి బాధ్య‌త ప్ర‌భుత్వానిదే.. కంపెనీ అస్స‌లు కాదు అని స్ప‌ష్టంచేవారు.

Related posts