telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్”లో శ్రియ…!

Shriya

రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లకు జోడీగా ఒలివియా మోరిస్ మరియు ఆలియా భట్ లు నటిస్తున్నారు ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. అయితే ఇప్పడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అజయ్ కు సంబంధించిన గతం చెప్పే సమయం లో అతనికి జోడీగా శ్రియనటించనుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే శ్రీయ తాజాగా సోషల్ మీడియాలో అభిమాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటించబోతున్నట్లు తెలిపింది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కు జంటగా శ్రియ నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడే రాజమౌళి దర్శకత్వంలో శ్రియ నటిస్తుంది. మరి శ్రీయ ఏ పాత్రలో మెరుస్తుందో చూడాలి. ఇప్పటిదాకా తన సినిమాల్లో హీరోయిన్స్ పరంగా అనుష్కను తప్ప వేరెవ్వరినీ రిపీట్ చేయని రాజమౌళి ఇప్పుడు శ్రీయను రిపీట్ చేస్తుండటం విశేషం.

Related posts