telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్

Arjun-Kapoor

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తనయుడు, బాలీవుహీరో అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు “నాకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం మీ అందరికీ చెప్పడం నా బాధ్యత. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. నేను బాగానే ఉన్నాను. డాక్టర్లు, అధికారుల సూచన మేరకు నేను నా ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. హోం క్వాంటైన్‌లోనే ఉంటాను. మీ ప్రోత్సాహానికి ముందుగానే కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో నా ఆరోగ్యం గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. గతంలో ఎప్పుడూ చూడని కఠిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మానవాళి ఈ వైరస్‌ను అధిగమిస్తుందని నాకు నమ్మకం ఉంది. ప్రేమతో, మీ అర్జున్” అని అర్జున్ పోస్ట్‌ చేశారు. అర్జున్ అభిమానులు, ఫాలోవర్లు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన సినిమా విషయానికొస్తే… అర్జున్ కపూర్ చివరిగా 2019లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం ‘పానిపట్’లో కనిపించారు. ప్రస్తుతం హారర్-కామెడీ చిత్రం ‘భూత్ పోలీస్’ చిత్రంలో నటించడానికి ఆయన అంగీకరించారు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, యామి గౌతమ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవలే ప్రకటించారు.

 

View this post on Instagram

 

🙏🏽

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

Related posts