కృష్ణా జిల్లాలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో తెలంగాణ వాసులు మృతి చెందడంతో సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.మృతులంతా ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి చెందినవారు. వారి స్వస్థలం ఎర్రుపాలెం మండలం గోపవరం. వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.