telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్ కు క్రికెట్ ఆస్ట్రేలియా విరాళం…

cricket board australia introducing parental leaves

కరోనా పోరులో భారత్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ అండగా నిలుస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్, యునిసెఫ్ ఆస్ట్రేలియా భాగస్వామ్యంతో అవసరమైన నిధులను సేకరించేందుకు సిద్దమైంది. కరోనా సెకండ్ వేవ్ భారత్‌కు చేస్తున్న నష్టాన్ని చూసి క్రికెట్ ఆస్ట్రేలియా చలించిపోతుంది. ఈ విపత్కపరిస్థితుల్లో భారత్‌తో బలమైన స్నేహాన్ని పంచుకోవడానికి ఆస్ట్రేలియన్లు సిద్దంగా ఉన్నారు. యూనిసెఫ్ ఆస్ట్రేలియా సాయంతో ఈ నిధులను ఖర్చు చేయనుంది. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల స్థాపనకు, కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కావాల్సిన పరీక్షా సామాగ్రిని, కోవాక్స్ ప్రోత్సాహంతో వ్యాక్సిన్ పంపిణీకి చేయడానికి ఖర్చు చేయనుంది. ఈ నిధుల సేకరణ కార్యక్రమంలో ముందుగా క్రికెట్ ఆస్ట్రేలియా తమ వంతు సాయంగా 50వేల డాలర్లను విరాళం అందజేస్తుంది. ఆస్ట్రేలియా ప్రజలందరూ తోచిన సాయం చేయాలని కోరుతోంది’అని ఆ ప్రకటనలో పేర్కొంది. అందరి కన్నా ముందుగా ఆస్ట్రేలియా పేసర్, కేకేఆర్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్‌ 50వేల డాలర్లు విరాళం అందించి అందరికి ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే.

Related posts