కుప్పంలో రెండో రోజు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ ఉదయం ఆర్ అండ్ బి అతిథి గృహంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. 11 గంటలకు గుడుపల్లికు చేరుకుని అక్కడ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు.
సాయంత్రం 3 గంటలకు కుప్పంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు కుప్పంలోనే బస చేయనున్నారు.