telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీలా తండ్రి అధికారం అడ్డుపెట్టుకునే తాగుబోతును కాను : కంగనా

Kangana

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్,‌ మహారాష్ట్ర సర్కారు మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. శివసేన దసరా ర్యాలీ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చిన కొందరు ముంబై నగరాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)తో పోల్చారని, వారు నమ్మకద్రోహలుగా మిగిలిపోతారని కంగనాను ఉద్దేశిస్తూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. దీంతో కంగనా వరుస ట్వీట్లతో రెచ్చిపోయింది. “నువ్వు వారసత్వాన్ని అడ్డుపెట్టుకుని వచ్చిన నొపొటిజం ప్రొడక్ట్‌వి. ఉద్ధవ్ నన్ను నమ్మక ద్రోహి అన్నారు. ముంబై షెల్టర్ ఇవ్వకపోతే నాకు తిండి కూడా దొరకదని అన్నారు. నాకు మీ కొడుకు వయసుంటుంది. జీవితంలో కష్టపడి ఎదిగిన ఒంటరి మహిళ గురించి ఇలా మాట్లాడిన మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తోంది. ముఖ్యమంత్రి గారూ.. మీరొక చెత్త నెపోటిజమ్ ప్రొడక్ట్` అని ట్వీట్ చేసింది. మరో ట్వీట్‌లో ‘సీఎం గారూ.. మీలా తండ్రి అధికారం, డబ్బు అడ్డుపెట్టుకునే తాగుబోతును కాదు. నేను వారసత్వాన్ని నమ్ముకుని ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. నేను కూడా ఓ ఘనమైన వారసత్వం ఉన్న ఉన్నతమైన కుటుంబం నుంచే వచ్చాను. కానీ నేను ఆ వారసత్వం మీద, సంపద మీద ఆధారపడదలచుకోలేదు. కొంతమందికి ఆత్మగౌరవం, స్వీయ విలువ ఉంటాయి’ అని కంగన ఘాటుగా ట్వీట్ చేసింది.

Related posts