మంత్రి నారా లోకేశ్, ఫీజు రీయింబర్స్ మెంట్ పై మోహన్ బాబు చేస్తున్నదంతా రాజకీయమేనని అన్నారు. తాజాగా లోకేష్, మీడియాతో మంత్రి మాట్లాడుతూ. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టీడీపీకి ఎలాంటి లోపాయికారీ ఒప్పందం లేదన్నారు. టఫ్ నియోజకవర్గం కాబట్టే.. మంగళగిరి స్థానాన్ని ఎంచుకున్నానన్నారు. మంగళగిరిలో విజయం సాధిస్తానని లోకేశ్ అన్నారు.
ఇటీవల మోహన్ బాబు రోడ్డెక్కి ఏపీసీఎం ఫై తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన విద్యాసంస్థకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా నాలుగేళ్లుగా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని ఆయన అన్నారు. బాబు మాటలే తప్ప రాష్ట్రానికి చేసింది ఏమి లేదని ఘాటుగా విమర్శించిన నేపథ్యంలో లోకేష్ స్పందించారు.