telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అమ్మోరు తల్లి”గా నయనతార… ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్

Ammoru-Thalli

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార కీలక పాత్రలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘మూకుతి అమ్మన్’. తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్‌జె శ‌రవ‌ణ‌న్‌, ఆర్జే బాలాజీ‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని విజయదశమి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఆర్జే బాలాజీ తొలిసారి దర్శకత్వం వహిస్తూ, నయనతారతో కలిసి నటించిన ‘అమ్మోరు తల్లి’ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంటూ చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు మహేష్ బాబు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమ్మోరుతల్లి ట్రైలర్ షేర్ చేశారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌‌లో నవంబరు 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇక దీంతోపాటు నయన్ తమిళంలో మరో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘నెట్రిక్కన్’ (మూడో కన్ను)లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆమె ప్రియుడు, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ నిర్మిస్తుండగా.. ‘గృహం’ ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌‌లుక్ ప్రేక్షకాదరణ పొందింది.‌

Related posts