telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అరుణ్‌ జైట్లీ మైదానంలో .. కోహ్లీ కచేరి.. గబ్బర్‌ వాయిద్యం..

gabbar revealed kohli music interest

తాజాగా, ఫిరోజ్‌షా కోట్లా మైదానానికి అరుణ్‌ జైట్లీ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఆ వేడుకలోనే మైదానంలోని ఓ స్టాండ్‌కు విరాట్‌ కోహ్లీ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా భాజపా నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్లు సైతం వచ్చారు. కార్యక్రమం సాంతం ఆహ్లాదంగా సాగిపోయింది. వేడుకను సరదాగా నిర్వహించేందుకు హోస్ట్‌ అక్కడున్న వ్యక్తులను కొన్ని ప్రశ్నలు అడిగాడు. అందులో భాగంగా విరాట్‌ కోహ్లీ ఎక్కువగా ఎలాంటి సంగీతాన్ని ఆస్వాదిస్తాడని కోచ్‌ రవిశాస్త్రిని అడిగాడు.

కోహ్లీని శిఖర్‌ ధావన్‌ పక్కన కూర్చోబెట్టి చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది. వెనకాలే కూర్చున్నాడు. అతడినే అడగండి.. అని బదులిచ్చాడు. విరాట్‌ ఎలాంటి సంగీతం వింటాడని శిఖర్‌ను అడగ్గా.. పెళ్లికి ముందా? తర్వాతా? అని ఓ జోకు పేల్చి ‘విరాట్‌కు పంజాబీ సంగీతంపై ఆసక్తి ఉంది. అతడు గురుదాస్‌ మన్‌ సంగీతాన్ని ఆస్వాదిస్తాడు. అర్జిత్‌ సింగ్‌ ప్రేమ పాటలకూ పెద్ద అభిమాని. మేమిద్దరం ఎప్పుడు ఒకే గదిలో ఉన్నా, అతడు అన్ని పాటలూ వింటాడు. ప్రత్యేకించి పాత పంజాబీ సంగీతాన్ని’ అని గబ్బర్‌ వెల్లడించాడు. ఈ సరదా సన్నవేశానికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

Related posts