జెరూసలేం మత్తయ్య ఓటుకు నోటు కేసును మళ్ళీ తెరపైకి తెచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనను బలవంతంగా ఇరికించారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తన పేరు చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఈ కేసులో రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన సీఎం చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందే కేసును దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని మత్తయ్య కోరారు.
ఈ కేసులో తనకు రాజకీయంగా న్యాయం జరుగలేదని, తాను నిర్దోషినని హైకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టులో ఉదయ్‌సింహతో పాటు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అవ్వాలని పట్టుబట్టారు. కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. సీబీఐ, ఎన్‌ఐఎతో ఈ కేసు విచారణ జరపాలని ఈనెల 11 ఏపీభవన్‌లో నిరసన దీక్ష చేస్తున్నానని, దీక్షకు పలు క్రిస్టియన్ సంఘాలు మద్దతు తెలుపనున్నట్లు జెరూసలేం మత్తయ్య వెల్లడించారు.
చిన్న లొల్లి అని చెప్పడం కేసీఆర్‌కు సిగ్గుచేటు: ఎంపీ సంజయ్