telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వ‌చ్చేఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు ఉండవు..గుండు సున్నాతో స‌మానం

*ప‌వ‌న్‌ ,చంద్ర‌బాబుపై కొడాలి నాని ఫైర్‌
*ఎన్టీఆర్‌, చిరంజీవి పేర్లు వాడ‌కుండా ఎన్నిక‌ల‌కు వెళితే గుండు సున్నాతో స‌మానం
*చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌లిసి ముద్ర‌గ‌డ పాదాలు క‌డిగిన పాపం పోదు

మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు ఉండవని ఆయన తెలిపారు. ఆ రెండు పార్టీల పీడ విరగడవుతుందని అన్నారు

గుడివాడ 10వ వార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ చిరంజీవి, చంద్రబాబు ఎన్టీఆర్ ఫొటోలతో ప్రచారం చేయకుండా ఒంటరిగా ప్రచారం చేయాలని ఆయన సవాల్ విసిరారు

ఎన్టీఆర్, చిరంజీవిల పేర్లు వాడకుండా ఎన్నికలకు వెళితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గుండు సున్నాతో సమానమ‌ని అన్నారు. కనీస పరపక్వతలేని, రాజకీయ అజ్ఞాని పవన్ కల్యాణ్ అని నాని విమర్శించారు.

ప‌వ‌న్ ఓటింగ్ ను చంద్ర‌బాబుకు ఆహారంగా వేస్తాడని.. కాపుల‌ను బీసీల్లో చేరుస్తాన‌ని చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు చెప్పారు. మరి ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించారు. ముద్ర‌గ‌డ ఫ్యామిలీ ప‌ట్ల చంద్ర‌బాబు దారుణంగా వ్య‌వ‌హ‌రించారన్నారు.

వైసీపీకి అరవై శాతం ఓట్లు ఉన్నాయని, ఎవరు కలసి వచ్చినా వైసీపీని ఓడించడం సాధ్యం కాదని తెలిపారు. పవన్ కల్యాణ్, చంద్రబాబులను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. పవన్ కల్యాణ్ ది నిలకడలేని మనస్తత్వం అన్నారు. తన అన్న చిరంజీవి పుట్టినరోజు పెట్టుకుని ఆరోజే ఆయన రాజకీయ కార్యక్రమాలను పెట్టుకోవడాన్ని చూసి సొంత పార్టీ అభిమానులే ఆశ్చర్యపోతున్నారని కొడాలి నాని అన్నారు.

సినిమా టిక్కెట్ల‌పై మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌ను సీఎం జగన్ గౌర‌వంగా ఆమోదించారన్నారు కొడాలి నాని. చిరంజీవి మాటకు క‌ట్టుబ‌డిన ముఖ్యమంత్రి.. చిరంజీవి తీసుకొచ్చిన సినీ పెద్ద‌ల‌తో సీఎం మాట్లాడారని గుర్తు చేశారు. చిరంజీవిని సీఎం జగన్ దంపతులు ఎంతో గౌర‌వంగా చూసారని పేర్కొన్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింద‌ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని.. చంద్ర‌బాబు ప్యాకేజి చిల్ల‌ర డ‌బ్బుల‌కు ప‌వ‌న్ అమ్ముడిపోయారని సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని.

Related posts